General

కాకతాళీయం -6

By Surya · 491 views · 5 min read · 20 Oct 2026

No sex content in this part. People looking for such content please skip this story

అలా శ్రీ వత్స మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చాడు.


"హే సూర్యా కదా!! నిన్ను ఇక్కడ చూస్తాననుకోలేదు" అన్నాడు.


అది విన్న నేను వీడు ఇప్పుడే వచ్చాడు అనుకున్నా. నేను వెంటనే కలుగజేసుకుని, నేను కూడా మిమ్మల్ని ఇక్కడ చూస్తాననుకోలేదు అన్నట్లు, "మీరే వచ్చారా? మహాలక్ష్మి కూడా వచ్చిందా?" అని అడిగాను.


దానికి శ్రీ వత్స నవ్వుతూ, "లేదు, నేనే వచ్చాను" అని చెప్పాడు...


ఇక వీడితో మాట్లాడితే కష్టం అని చెప్పి, నేను కృష్ణ అక్కడి నుంచి అతనికి బై చెప్పేసి ఉప్పల్ వెళ్లే దారిలో పడ్డాం..


దారిలో కృష్ణ నాతో ఏమీ మాట్లాడలేదు..
నేను వెనుక నుంచి కృష్ణని గట్టిగా హగ్ చేసుకుని తన వీపు మీద నా తల ఆనించి పడుకున్నా...


సమయం అలా ఎగిరిపోయింది. చూస్తుండగానే ఉప్పల్‌కి వచ్చేశాం. కృష్ణ నన్ను మా పిన్ని ఇంటి ముందు డ్రాప్ చేశాడు. నా నంబర్ తీసుకున్నాడు. నైట్ మెసేజ్ చేస్తానని చెప్పాడు. నేను ఏదో చెప్పబోయే లోపల అటూ ఇటూ చూసి నా బుగ్గ మీద చుప్ అని ముద్దు పెట్టి బైక్‌లో పారిపోయాడు...


నాకు ఏం జరిగిందో తెలిసే లోపు అతను నా దృష్టి నుంచి కనుమరుగైపోయాడు...


నేను సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్లాను.
ఇల్లంతా హడావిడిగా ఉంది.

మా పిన్ని బ్యాగులు సర్దుతోంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు. బాబాయ్ ముఖం బేలగా పెట్టి శూన్యంలోకి చూస్తున్నాడు.


ఇంట్లో ఇంకో ఆంటీ ఉన్నారు. ఆవిడ కృష్ణ వాళ్ల అమ్మగారు.


పిన్ని నన్ను చూడగానే, "రారా సూర్యా! బ్యాగ్ సర్దుకో. వెళ్దాం" అన్నది.

నేను కన్ఫ్యూజ్ అయి, "ఎక్కడికి పిన్ని?" అని అడిగా...

పిన్ని తల పైకి ఎత్తకుండా, "మీ బాబాయ్‌కి SWIMSలో ఏదో పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇన్విటేషన్ వచ్చిందిరా.. పనిలో పనిగా మేము కూడా తిరుమల చూసినట్లు, మీ అమ్మానాన్నలను చూసినట్లు ఉంటుంది అని చెప్పి వెళ్తున్నాం. పైగా పక్కింటి ఆంటీకి తిరుమల సుప్రభాత సేవ టికెట్లు ఎవరో ఒక ఏడు టికెట్లు ఇచ్చారంట. ఆంటీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో, అందరం వెళ్తున్నాం.. నువ్వు కూడా రెడీ అయి ప్యాకింగ్ చేసుకో. వెళ్దాం" అని హడావిడి చేస్తూ పిన్ని చెప్తుంది.


నాకు ఇంటికి వెళ్లాలని అస్సలు లేదు. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండి కృష్ణతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది....

నేను పిన్ని తో, "నేను రావట్లేదు పిన్ని. నేను వచ్చి టూ డేస్ అవ్వలేదు. అప్పుడే మళ్లీ ఇంటికి వెళ్లాలని అస్సలు లేదు. ఒకసారి ఇంటికి వెళ్తే నాన్న నన్ను మళ్లీ తిరిగి పంపడు. నేను రాను పిన్ని. మీరు వెళ్లి వచ్చేయండి" అని అన్నా...

దానికి మా పిన్ని చేస్తున్న పని ఆపి, "మేము లేకుండా నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావురా? నీకు ఎవరో ఒకరు తోడు ఉండాలిగా" అని కసిరింది..

దానికి కృష్ణ వాళ్ల అమ్మ నవ్వుతూ, "కుముదా! మా కృష్ణ కూడా ఒక్కడే ఉంటున్నాడు. అతను కూడా ఏదో ఆఫీస్ పని ఉంది అని చెప్పి రాను అన్నాడు. ఇద్దరూ కలిసి ఉంటారులే" అని చెప్పింది.

నాకు కళ్లు మెరిశాయి. కృష్ణతో ఒంటరిగా ఉండాలా... అబ్బా! ఆ ఊహే ఎంత బాగుందో...


కృష్ణ వాళ్ల అమ్మ నాకు ఒక దేవతలా కనిపించడం మొదలుపెట్టింది....


దానికి మా పిన్ని ఏదో అనబోతుండగా, బాబాయ్ కలుగజేసుకుని, "వాడిని వదిలేయ్ కుముదా! వాడు మన ఏజ్ గ్రూప్‌తో సెట్ అవ్వడు. వచ్చిన వాడికి సుద్ద బోరే గానీ ఉంటుంది" అని అన్నాడు...


మొదటిసారి బాబాయ్ కూడా నాకు ఎంతో ముద్దుగా అనిపించాడు....


మా బాబాయ్ మాట్లాడటంతో మా పిన్ని ఇంకేం అనకుండా, "ఇల్లు చెత్త చేయకు" అని చెప్పి కీస్ చేతిలో పెట్టింది.


చూస్తుండగానే మా బాబాయ్, పిన్ని, ఇద్దరు పిల్లలు, కృష్ణ వాళ్ల అమ్మ అందరూ ఉబర్ బుక్ చేసుకుని బస్ స్టాప్‌కి వెళ్లిపోయారు.

నేను, కృష్ణ బయట చేతులు ఊపుతూ బై చెప్తున్నాం....


వాళ్ల కారు కనుమరుగయ్యాక కృష్ణ చూపు నా మీద పడింది...


నేను అది చూడనట్లు ఇంట్లోకి వెళ్తున్నా...
తను కూడా ఫాలో అవుతున్నాడు..

నేను వెనక్కి తిరిగి, "ఎక్కడికి వస్తున్నావ్?" అని అడిగా.

తను కుక్కపిల్లలాగా చూస్తూ, "ఇంట్లోకి" అన్నాడు..

"మీ ఇల్లు అది" అని వాళ్ల ఇంటి వైపు చెయ్యి చూపించా..

అతను, "నేను నీతో వస్తాను" అన్నాడు..

"నాతో ఎక్కడికి వచ్చేది.. మీ ఇంటికి వెళ్లు. తినేసి పడుకో" అని చెప్పాను....

నేను ఆ మాట అనగానే అతని మూతి వాడిపోయిన పువ్వులాగా అయిపోయింది...
అలా కూడా చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాడో...

అతను, "నీతో ఉండడం కుదరదా?" అని అన్నాడు....

నేను స్ట్రిక్ట్‌గా ఫేస్ పెట్టి, "కుదరదు" అన్నాను....

పాపం అతను నొచ్చుకున్నట్లు ఉన్నాడు. బెళగా ముఖం పెట్టి కాళ్లు ఈడ్చుకుంటూ వాళ్ల ఇంటికి వెళ్లాడు. నేను అతన్ని చూసుకుని నవ్వి ఇంట్లోకి వెళ్లాను....
అలా ఆ రాత్రి గడిచింది....


ప్రొద్దున్నే మా పిన్ని కి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారు అని అడగబోతే మా అమ్మే ఫోన్ ఎత్తింది...

మా అమ్మ, "ఏరా, నువ్వు ఎందుకు రాలేదు?" అని అడిగింది...

"అమ్మా, నేను వచ్చి రెండు రోజులు కాలేదు... మళ్లీ అప్పుడే ఇంటికి రావాలా?" అని అడిగాను..

దానికి అమ్మ, "నువ్వు వచ్చి ఉండాల్సింది సూర్యా.. హైదరాబాద్‌లో కరోనా కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి.. నువ్వు అలా ఇంటి పట్టున ఉండే పిల్లాడివి కాదు. బయట ఏదన్నా అయితే ఎలారా?" అని అంది...


"అమ్మా, ఏం కాదులే.. నేను ఇక బయటికి వెళ్తే జాగ్రత్తలు తీసుకుంటానులే" అని చెప్పి అమ్మను బతిమాలాను..


చివరికి అమ్మ ఒప్పుకుని, "సరే, మీ పిన్ని వాళ్లు మళ్లీ హైదరాబాద్ రాగానే నువ్వు రిటర్న్ వచ్చేయాలి" అని చెప్పింది...


నేను సరే అమ్మ అని చెప్పి కాసేపు అలా అమ్మతో మాట్లాడి ఫోన్ కట్ చేశాను.....
అయితే ఆ రోజు మన మోదీ తాత ఒక పెద్ద బాంబు వేశారు...


దేశం మొత్తం మీద లాక్‌డౌన్ విధించారు...
రాకపోకలు బంద్...


ఆఫీసులు, కార్యాలయాలు, అన్ని ఉద్యోగాలు బంద్...


ఎక్కడి వాళ్లు అక్కడే ఇంటికి పరిమితం....
నేను అమ్మతో ఫోన్ మాట్లాడి అలా స్నానం చేసి కూర్చోగానే ఇలాంటి దేశాన్ని కుదిపేసే వార్త బయటికి వచ్చింది...


నేను నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ నుంచి ఒక ఐదు మిస్డ్ కాల్స్...

నేను వెంటనే తిరిగి చేశాను.. అమ్మ ఫోన్ ఎత్తింది.. కానీ ఏమీ మాట్లాడడం లేదు... నేను అమ్మా, అమ్మా అని నాలుగు సార్లు పిలిచాను....


మా నాన్నలాగా పెద్ద ఉపన్యాసం ఇచ్చి నన్ను తిట్టకుండా అమ్మ ఒక పెద్ద ఊపిరి పీల్చుకుని, "అయిందేదో అయింది.. నువ్వు జాగ్రత్తగా ఉండు.. అలాగే ఆ పక్కింటి పిల్లాడికి కూడా చెప్పు. సులోచన గారు కూడా మన ఇంట్లోనే ఉన్నారు అని. అతని ఫోన్ కలవట్లేదు అంట. అతన్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది..


నేను వెంటనే కృష్ణ వాళ్ల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాను... డోర్ బెల్ కొట్టాను..
.
అతను డోర్ ఓపెన్ చేయడానికి ఒక త్రీ టైమ్స్ పట్టింది.. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అనుకుంటా..


నన్ను చూసి పెద్దగా స్మైల్ ఇచ్చి, "ఏంటి సూర్యా, పొద్దున్నే నా దగ్గరికి వచ్చావ్.. నన్ను మిస్ అయ్యావా?" అని నా భుజాల మీద చేతులు వేసి, తన బరువు నా మీద మోపి మాట్లాడుతున్నాడు....


నేను వెంటనే అతని చేతులు విదిలించి, "లాక్‌డౌన్ పెట్టారంట. తెలుసా?" అన్నాను..
"లాక్‌డౌనా?!" అని అడిగాడు...

నేను అతనికి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అతని ముఖం తెల్లబోయింది...

వెంటనే అతను నన్ను ఇంట్లోకి లాగి వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు..

వాళ్ల అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కాసేపు అలా మాట్లాడాక అతను ఫోన్ నాకు ఇచ్చాడు. నేను కృష్ణ వాళ్ల అమ్మతో మాట్లాడుతుంటే, "మా అబ్బాయిని కాస్త జాగ్రత్తగా చూసుకో బాబూ" అన్నారు.
నేను దానికి, "మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఆంటీ!" అని చెప్పి వాళ్ల అమ్మగారు చెప్పిన జాగ్రత్తలు విని ఫోన్ కట్ చేశాను....


కృష్ణ ఇంతకాలం నా వైపే చూస్తూనే ఉన్నాడు....


నేను ఫోన్ అతనికి ఇస్తూ, "ఏంటి? అలా చూస్తున్నావ్?" అని అడిగాను...


అతను నన్ను కౌగిలిలోకి లాక్కున్నాడు...

"సూర్యా...
ఇంకా ఇక్కడ మనం ఇద్దరమే ఉండబోతున్నాం....
.
నిన్న తప్పించుకున్నట్లు ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు....

ఆ దేవుడు మన కోసమే ఇలా దేశాన్ని మూయించాడేమో..

ఇక తర్వాత వచ్చే కాలం అంతా మనదే" అని నవ్వుతున్నాడు...

To be continued....

(సారీ గైస్! నవరాత్రి కనుక స్టోరీ రాయలేదు.. ఇక కంటిన్యూస్‌గా స్టోరీ రాసి పోస్ట్ చేస్తాను.
ఇంకా ఐ రియల్లీ ఫీలింగ్ డిసప్పాయింటెడ్.. చాలా మంది స్టోరీ చదువుతున్నారు కానీ ఎవ్వరూ లైక్స్ కానీ కామెంట్స్ కానీ పెట్టడం లేదు.. నా హంబుల్ రిక్వెస్ట్. మీరు పెట్టే లైక్స్ అండ్ కామెంట్సే మాకు ఎంకరేజ్‌మెంట్. మీరు ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ పెడితే అంత ఎక్కువగా మాకు స్టోరీ కంటిన్యూ చేయడానికి మోటివేషన్ వస్తుంది... మీరు పెట్టే లైక్స్ అండ్ కామెంట్స్ చూసి పనులు మానుకుని గంటలు గంటలు స్టోరీ రాయగలము. ప్లీజ్ కన్సిడర్ దట్..)
Login to like or save Back to library

Discussion & Reviews (13)

Share thoughts with Surya and the StoryHub community.

Join the discussion

Sign in to leave a comment or reply to Surya.

Sign in to comment
R
Raj · 3d ago

Okari meeda mana intense nijam aite prakruthi kuda manaki sahakaristundi antaru.. adi nijame anipistundi ee part chaduvutunte... Corona andarini duram cheste me iddarini daggara chesindi. Haha ade destiny

H
Hari ram · 22 Oct 2026

Vaduko Surya... Ayithe nakkuda Cameo undha story lo 😅

S
Surya Author · 21 Oct 2026

@Sam థ్యాంక్ యూ sam గారు. నా కథ మీ Nostalgia trigger చేస్తున్నందుకు గర్వపడుతున్నా

S
Surya Author · 21 Oct 2026

@Abhi థ్యాంక్యూ అభి.. త్వరలో పోస్ట్ చేస్తాను. ఇలాగే మీ అభిమానం నా మీద చూపిస్తూ ఉండండి

S
Surya Author · 21 Oct 2026

@Praveen మీరు చెప్పింది నిజమే ప్రవీణ్ గారు. నేను కావాలి అనుకుంటే దీనిని మాములు కథ లాగా అమ్మాయి అబ్బాయి నీ పెట్టీ వేరే ప్రతిలిపి లాంటి ప్లాట్ఫారం లో రాయొచ్చు. కానీ నేను అమ్మాయిల మీద ఆసక్తి చూపించలేను. నాకు నా సొంత భావాలు ఉన్నాయి. అవి అక్కడ మనుషులకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద ఉన్న మనుషులకే బాగా అర్థం అవుతాయి. లేని ప్రేమను ఆకర్షణను నేను చూపించలేను కదా! అది కథ లో అయినా సరే! నేను మాములు కథ రాస్తే అది ఎంత మంచి సాహిత్యం ఉపయోగించి రాసిన ప్లాస్టిక్ పువ్వులాగా వాసన ఉండదు. నేను నా సొంత భావాలు పోసిన ఈ కథ లాగా రాదు అని నా అభిప్రాయం

S
Surya Author · 21 Oct 2026

@Hari ram థ్యాంక్ యూ హరి రామ్. మీ పేరు చాలా బాగుంది నేను నా కథలో వాడుకోవచ్చా?

S
Surya Author · 21 Oct 2026

@krishna థ్యాంక్ యూ కృష్ణ గారు. Next part త్వరలో పోస్ట్ చేస్తాను.

S
Sam · 21 Oct 2026

Hii Surya

Finally the wait is over...
This part is sooo good and takes me back to good olden lockdown days like nostalgia
Waiting for the next part

A
Abhi · 21 Oct 2026

Hy surya
This part is worth the wait🫶
Eager for the release of next part take your time and give us best

P
Praveen · 21 Oct 2026

SURYA
i would like to share some thing with you . October 6th naa story " INOX THEATOR LO MATHI POGOTTINA MODDA" , nee story KAKATHALEEYAM , Publish ayyindi . Nijanga readers sensitive feelings ki importance isthe naa story kannaa nee story readers number thousands lo undaali, but it was not happened . so , readers taste verugaa undi . Simply they want erotic n sex content based anipisthundi . maximum people are nutral in exoressing thir views too . one or two giving their feed back. Even authors also not supporting our stories . It gives some bad 😞 feeling . upppphhh we hope readers may drop their reviews. TQ n love you🥰

P
Praveen · 21 Oct 2026

HI SURYA
AMMAY laa krisnaku andakundaa vaadiki pichekkinchadam bhale undi. Love lo modati saari padda vaallaku nee story super ga connect avuthundi , really nice story , naakaithe picha pichagaa nachindi

H
Hari ram · 21 Oct 2026

Lockdown anagaane I felt like Wooowwww .. next part kooda thwaraga post chey Surya

K
krishna · 20 Oct 2026

eagerly waiting for next part surya . kastha twaraga next part upload cheye.