కాకతాళీయం - 5
No sex content in this part. Please skip this if you are expecting such content
వారిజ వదిన ఇంట్లో చెప్పేసి వెంటనే నేను బైక్ తీసుకొని ఉప్పల్‌కి రిటర్న్ అయ్యాను.
ఇంటి దగ్గర ఎలాంటి చప్పుడు లేకుండా బైక్ పార్క్ చేసి ఇంట్లో ఆ కీస్ వెంటనే పిన్ని చేతిలో పెట్టేశాను. పిన్ని ఆ కీస్ చూసాక ఒక ఊపిరి పీల్చింది.
అప్పటికే మళ్లీ సాయంత్రం అయింది...
అలా పొద్దుపుచ్చుదాము అని చెప్పేసి మీదకి వెళ్లాను. పొద్దుపుచ్చడానికే వెళ్లానో, లేక ఇంకేదైనా కారణం కోసం వెళ్లానో నాకు తెలీదు.
అలా టెర్రస్ మీదకి వెళ్లగానే వేడిగాలి ముఖానికి కొట్టింది. నేను పైకి వెళ్లగానే లీలగా ఒక ఆకారం అక్కడ కనిపించింది...
కృష్ణ అక్కడే ఉన్నాడు. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా...
ఎవరికోసం చూస్తున్నాడు...
నాకోసమేనా...
నేను వెళ్లి నా సిగ్నేచర్ స్మైల్ ఇస్తూ, "ఎవరికోసం చూస్తున్నావ్ బాబు?" అని అన్నాను.
అతను నేను రావడం ఎప్పుడో గమనించాడు.
నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చాడు...
అంతవరకు ఎప్పుడూ కళ్ళే చూసే నేను అప్పుడే బుగ్గలు చూశాను. అతను నవ్వినప్పుడు డింపుల్స్ పడుతున్నాయి...
ఎంత క్యూట్‌గా ఉన్నాడో...
నన్ను చూసి కృష్ణ, "ఏం లేదు... అలా బోర్‌గా ఉంటే పైకి వచ్చాను," అన్నాడు.
"నేను అందుకే వచ్చాను..."
అందుకు కృష్ణ, "ఇంట్లో ఊరికే సమయం ఎందుకు వృథా చేయాలి? అలా ట్యాంక్ బండ్ దాకా వెళ్లొద్దామా?" అన్నాడు.
నేను, "సరే... 10 మినిట్స్‌లో కింద కలుద్దాం," అని చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోయాం.
నేను అలా ముస్తాబు అయి పిన్నికి ఒక మాట చెప్పేసి బయటికి వచ్చాను.
కృష్ణ మ్యాచింగ్ క్లాత్స్ వేసుకుని, సన్‌గ్లాసెస్ పెట్టుకుని రెడీ అయ్యాడు. ఏదో డేట్‌కి వెళ్లే వాడిలాగా...
నా ఆలోచనకి నేనే ఆశ్చర్యపడ్డాను.
ఈ వింత వింత ఆలోచనలన్నీ కట్టిపెట్టి అతని వెనుక ఎక్కి కూర్చున్నాను.
మా ద్విచక్ర వాహనం అలా భాగ్యనగర వీధుల్లో కలిసిపోయింది.
దారిలో నన్ను కృష్ణ చాలానే ప్రశ్నలు అడిగాడు. "మీది ఏ కాలేజ్? ఏం చదివావు? ఏం చేస్తున్నావు?" ఇలాంటివి...
నేను అంతా సమాధానం చెప్పాను.
ఇంతలో బైక్ పక్కనుంచి ఎవడో తాగుబోతు వెధవ స్పీడ్‌గా వెళ్లాడు.
కృష్ణ ఉన్నట్టుండి బైక్ బ్రేక్ వేసి జర్క్ ఇచ్చాడు.
ఈ లోపు నేను తేరుకోలేక కృష్ణను గట్టిగా హత్తుకున్నాను...
నేను అది పట్టించుకోలేదు. వెంటనే గట్టిగా, "ఒరేయ్ దిక్కుమాలినోడా! పోతావ్ రా పైకి!" అని ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసే వాడిని తిట్టాను.
వాడు నిజంగానే తాగినట్లున్నాడు. పట్టించుకోలేదు.
కృష్ణ ఈ టైంలో బైక్ పూర్తిగా ఒక సైడ్‌కి ఆపేశాడు. ఆ తాగుబోతు వెధవ దృష్టి నుంచి దూరం అవగానే నేను కృష్ణను హత్తుకోవడం తెలిసింది.
కానీ ఎందుకో వదలాలి అనిపించలేదు...
అలాగే గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. కృష్ణ కూడా ఏమీ అనలేదు. బైక్ మళ్లీ స్టార్ట్ చేసి ఈసారి మెల్లగా పోనిచ్చాడు.
ఎందుకు మెల్లగా వెళ్తున్నాడు?
సేఫ్టీ కోసం మెల్లగా వెళ్తున్నాడా...
లేదా ఈ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడానికా...
రీజన్ ఏదైనా సరే మన మంచికే అని చెప్పి నేను ఏమీ అనలేదు.
ఆ క్షణం అలా ఉండిపోతే బాగుండు... కానీ చూస్తూ ఉండగానే ట్యాంక్ బండ్ వచ్చేసింది.
కృష్ణ బైక్ పార్క్ చేసి, "ఎక్కడికి వెళ్దాం?" అని అన్నాడు.
"ఎలాగూ లుంబినీ పార్క్‌కి వచ్చేశాం కదా... లోపలికి వెళ్దాం," అన్నాను.
అతను ఎందుకో నా కళ్లల్లోకి చూడలేకపోతున్నాడు...
సరే అని చెప్పేసి ఇద్దరం అలా టికెట్లు కొనీ లుంబినీ పార్క్‌లోకి వెళ్లాం.
సండే కావడంతో జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు...
మేము ఒక ఐస్‌క్రీమ్ షాప్ దగ్గర ఐస్‌క్రీమ్ తెచ్చుకుని ఒక మంచి వ్యూ ఉన్న ప్లేస్‌కి వెళ్లి తింటున్నాం...
ఇంతలో కృష్ణ మళ్లీ అడిగాడు.
"నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా?"
నేను ఈసారి ఎలాంటి వికృత సమాధానాలు చెప్పకుండా సూటిగా, "లేదు," అని చెప్పేశా.
"పోనీ... ముందు ఎవరన్నా ఉన్నారా?" అని అడిగాడు.
నేను దానికి తల అడ్డంగా ఊపాను.
అతను ఏదో చెబుదామని నోరు తెరుస్తున్నాడు, మూస్తున్నాడు... కానీ మాటలు బయటికి రావట్లేదు...
నేను అతన్ని అలాగే చూస్తున్నాను... ఏం చెబుతాడో అని.
కృష్ణ మళ్లీ అడిగాడు, "నేను నీకు గుర్తుకు లేనా? నన్ను అస్సలు గుర్తుపట్టలేదా?"
ఈ మాటలు విన్న నేను ఆశ్చర్యపోయాను...
కృష్ణకి నేను ముందే తెలుసా?
నేను తల ఊపుతూ, "లేదు. కానీ నేను నీకు ముందే తెలిసినట్లుంది," అన్నాను కాస్త కుతూహలంతో.
"శ్రీ వెంకటేశ్వర మోడ్రన్ స్కూల్," అన్నాడు.
అది విని నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అది నేను చదివిన స్కూల్!
నేను ఏదో చెప్పబోయేలోపే కృష్ణే మళ్లీ మాట్లాడాడు.
"శ్రీ వెంకటేశ్వర ఇంటర్మీడియట్ కాలేజ్."
నాకు మళ్లీ షాక్...
ఇది నేను ఇంటర్ చేసిన కాలేజ్...
నేను వెంటనే, "ఇది నా స్కూల్ అండ్ ఇంటర్ కాలేజెస్. ఇవి నీకు ఎలా తెలుసు?" అని అడిగాను.
అతను నా వైపు సూటిగా చూస్తూ, "ఎందుకంటే నేను చదివింది ఇక్కడే," అన్నాడు.
ఇది నాకు ఇంకో పెద్ద సంభ్రమాశ్చర్యం.
"అంటే మీది కూడా తిరుపతేనా?" అని అడిగాను.
అందుకు అతను ఒక నవ్వు నవ్వి తల ఊపాడు.
"ఆ ఏడు కొండలవాడి పాదాల కింద వెలసిన నగరం తిరుపతి నా సొంత ఊరు. నేను హైదరాబాద్‌కి వచ్చింది తిరుపతి నుంచే..."
"మరి నేను నిన్ను ఎప్పుడూ చూడలేదే?" అని అన్నాను.
"నువ్వు చూసే ఉంటావు... కానీ అంత గమనించి ఉండవు," అని అన్నాడు.
నేను అది నిజమేగా అని అనుకున్నా.
కృష్ణ మాట్లాడుతూ, "నేను 10thలో ఉండగా నిన్ను మొదటిసారి చూశాను. అప్పుడు నువ్వు 9th.
సూర్యా... నిన్ను చూసిన ఆ మొదటి రోజు ఇంకా నాకు గుర్తుంది. మన స్కూల్ డ్రెస్ వేసుకుని, నీ సైజ్ ఉండే బ్యాగ్ మోసుకుంటూ, ఇంకో చేతిలో పెద్ద లంచ్ బ్యాగ్ పట్టుకుని నిర్లక్ష్యంగా నడుస్తూ కనిపించావు.
ఎంత ముద్దుగా ఉన్నావో అనిపించింది... ఇంతకు ముందు నిన్ను ఎందుకు ఎప్పుడూ గమనించలేదు అనుకున్నాను.
తర్వాత నిన్ను గమనించడమే నా రోజువారీ పనిగా పెట్టుకున్నాను. రోజూ నిన్ను చూస్తూ ఉండేవాడిని...
నువ్వు ఎంతో ఒక విచిత్ర జీవివి. రోజుకొకలా కనిపిస్తావు.
నిన్ను 9th క్లాస్ మొత్తం గమనించాను. తర్వాత నాది 10th అయిపోయింది. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ చేరాను. నువ్వు కూడా అక్కడే చేరాలని ఎంత కోరుకున్నానో...
అనుకున్నట్లే నువ్వు అక్కడే చేరావు. అక్కడ కూడా నిన్ను ప్రతిరోజూ గమనించేవాడిని.
ఒకసారి సెప్టెంబర్‌లో నీకు డెంగ్యూ వచ్చి 10 రోజులు దాకా కాలేజ్‌కి రాలేదు. అప్పుడు నేను ఎంత తల్లడిల్లిపోయానో...
ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్‌లాగే నీతో క్లోజ్‌గా ఉండాలి అనిపించింది. కానీ ఏదో భయం...
అలా ఇంటర్ కూడా అయిపోయింది.
నేను కావాలని నీకోసమే ఇంట్లో కోచింగ్ అని చెప్పి సంవత్సరం వేస్ట్ చేశాను. నీతో కలిసి ఒకే యూనివర్సిటీలో జాయిన్ అవుదామని...
కానీ మా నాన్నగారు అప్పుడే చనిపోయారు. ఇంట్లో కుటుంబ బాధ్యత నా మీద పడింది. తిరుపతిలోనే SV యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లిపోయావు.
నిన్ను జీవితంలో మళ్లీ కలవను అనుకున్నాను. కానీ నా దూరపు బంధువు దుర్గ నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
దుర్గ అప్పుడప్పుడూ నీ గురించి చెప్పేది. అది విని ఆనందించేవాడిని. కానీ నీ మీద దుర్గను ప్రశ్నలు వేయడానికి ధైర్యం సరిపోలేదు...
మీ అందరి స్నేహం, చనువు చూసి ఎంతో అసూయపడ్డాను. మీ ఫ్రెండ్స్ అందరి మీదా అసూయే నాకు... వాళ్లు నీతో ఉండగలుగుతున్నారు. నేను లేను అందులో.
ఎలాగోలా గ్రాడ్యుయేట్ అయి బెంగళూరులో జాబ్ సంపాదించా.
నీకు దుర్గకి మధ్య ఉన్న రిలేషన్ కూడా తగ్గిపోయింది. నిన్ను మళ్లీ చూస్తానో లేదో అనుకుంటున్న టైంలో నేను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యాను...
ఇక మనం జీవితంలో కలుసుకోము అని కుమిలిపోతున్న రోజు... నిన్న నా ముందు మళ్లీ ప్రత్యక్షమయ్యావు.
నీతో మాట్లాడాను. నీతో తిరిగాను.
సూర్యా... ఇంకా నేను దాచుకోవాలి అనుకోవడం లేదు. నా మనసులోని మాట నీకు చెప్పేస్తున్నా...
నిన్ను మొదటిసారి చూసినప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియని వయసు. నీ మీద ఆసక్తి ప్రేమగా ఎలా మారిందో ఎంతో తెలియలేదు.
నేను నిన్ను అడుగుతున్నా సూర్యా... నీ జీవితాన్ని నాతో పంచుకోగలవా?
నువ్వు లేని జీవితం వృథా అనిపిస్తుంది.
నువ్వు నాతో గడిపిన సమయం చాలా తక్కువ. కానీ నేను నిన్ను ప్రేమించిన సమయం చాలా ఎక్కువ.
దయచేసి ఈ అజ్ఞాత ప్రేమికుడిని నీ జీవితంలోకి తీసుకోగలవా?.."
అతను నాకు ప్రపోజ్ చేస్తున్నాడా...
నా వెనుక అతను ఇంత గమనించాడా...
నా కోసం అంత తల్లడిల్లాడా...
నేను కృష్ణ ముఖం చూస్తూ ఉండిపోయాను.
అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
నేను అతన్ని తిరస్కరిస్తే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడు.
నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
నా మనసు విచిత్రంగా అతన్ని అంగీకరించడానికి కారణాలు వెతుకుతోంది.
మనం ప్రేమించే వాళ్ల కంటే మనల్ని ప్రేమించే వాళ్లకే మన అమాయక మనసులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి...
నేను దానికి వ్యతిరేకం ఏమీ కాదుగా...
నేను అతని వైపు చూస్తూ తల ఊపాను.
నేను నా బొంగురుపోతున్న గొంతును అనచుకుని, కూల్‌గా కనిపించడానికి ట్రై చేస్తూ, "సరే," అన్నాను.
కృష్ణకి నేను చెప్పింది ఈ వ్యక్తికి అర్థం కాలేదు అన్నట్టు ఉంది. ఇంకా కుక్కపిల్లలా దీనంగా చూస్తున్నాడు.
నేను కొంచెం స్మైల్ ఇచ్చి, "కృష్ణా... నిన్ను నేను మొదటిసారి నిన్నే చూశాను. ఎంత క్యూట్‌గా ఉన్నావో అనిపించింది. నిన్ను చూస్తున్నప్పుడు నాకు అపరిచితుడిని కాకుండా ఎన్నాళ్లుగానో తెలిసిన వ్యక్తిని చూస్తున్నట్లుగా అనిపించింది.
మరి రెండు రోజులకే ప్రేమ అంటే చాలా త్వరగా అనిపిస్తుంది. అయినా కూడా నేను నీ ఒప్పుకోలు స్వీకరిస్తున్నా," అని చెప్పి నా చేతులు చాచి అతన్ని హత్తుకుందామని తెరిచాను.
అతను కాసేపు అలానే చూస్తూ ఉన్నాడు.
తర్వాత నన్ను గట్టిగా హత్తుకున్నాడు.
ఆరు అడుగులు పైన ఉన్నాడు తాటి చెట్టులాగా. నేను ఏమో 5'8 ఉన్నా కానీ అతని ముందు పొట్టిగానే ఉన్నా. నా ముఖం అతని గుండెల్లోకి వెళ్లిపోయింది...
కాసేపు అలా ఉండిపోయి కృష్ణ మెల్లిగా నన్ను వదిలేశాడు.
తర్వాత నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే కృష్ణని చూస్తూ ఉండిపోయాను...
ఇంతలో నాకు కొద్ది దూరంలో ఏదో అలికిడి వినిపించింది.
నేను తిరిగి చూస్తే అక్కడ శ్రీవత్స ఉన్నాడు.
అతను ఎంతసేపు అక్కడ ఉన్నాడో తెలీదు.
కానీ ఉన్నాడు...
ఎంత చూశాడో, ఏం విన్నాడో తెలియదు...
నన్నూ, అతన్నీ మార్చి మార్చి చూస్తున్నాడు...
To be continued..
Please Like and comment...
To contact me tap my Insta link
https://www.instagram.com/surajtz0?stkn=MTB2Mm90NDA3cnh4dg==

Discussion & Reviews (4)
Share thoughts with Surya and the StoryHub community.
Sign in to leave a comment or reply to Surya.
Suryaaa.. enni rojulu nundi choosthunnano.. madhyalo ala kadha aapesthe ela
hii surya
good morning , KAKATHALUYAM 6th episode eppudu ? im waiting eagerly man , post it soon 👍
@Raj thank you soo much raj.. ilage nannu support chestu undandi
Ohhh surya... Ne maatallo Edo teliyani aakarshana undi. Chaduvutuntee connect aipotunna... Chala baga rasav. Nijam ga alaa kalla mundu kaladutundi katha...