కాకతాళీయం - 4
No sex content in this story. Kindly skip this story if you are expecting sex story.
నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు....
ఇతను అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నాడు....
అయినా నెత్తిమీద 25 ఏళ్లు వచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడం మెచ్చుకునే విషయం కాదు...
నేను వెకిలిగా ముఖం పెట్టి, "నమ్మేశానులే" అన్నాను.
అతను గంభీరంగా ముఖం పెట్టి, "నిజం చెప్తున్నా" అన్నాడు.
అతను నా కళ్లల్లో ఏదో వెతకాలన్నట్టు తొంగి తొంగి చూస్తున్నాడు. ఏం వెతుకుతున్నాడు...
ఇంతలో అతని ఫోన్ మళ్లీ మోగింది. ఇద్దరం తెరుకున్నాం. అతను ఫోన్ సైలెంట్‌లో పెట్టాడు. నేను శబ్దం చేయకుండా కిందికి వెళ్లాలి అని వెళ్లిపోతున్నాను.
నేను వెళ్లిపోతుంటే, "నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందో లేదో చెప్పలేదు" అన్నాడు.
అతనికి ఏం అవసరం నాకు గర్ల్‌ఫ్రెండ్ ఉన్నా లేకున్నా?
ఈ ప్రశ్న ఇంకొకరు వేసి ఉంటే సమాధానం వేరేలా వచ్చేదేమో!
కానీ ఒక చిన్న నవ్వు నవ్వి, "ఏం, నువ్వు చూసి పెడతావా?" అని రిప్లై ఇచ్చాను.
అతను నేను ఇచ్చిన సమాధానానికి షాక్ అయినట్టున్నాడు. అతను ఏదో అడగాలని చూసేలోపే నేను కిందికి వచ్చాను...
ఇంట్లో పిన్ని పిల్లలతో హోంవర్క్ చేయిస్తోంది... బాబాయి బాల్కనీలో విస్కీ పుచ్చుకుంటున్నాడు....
నేను రావడం చూసి బాబాయి, "రారా, నువ్వు కూడా తీర్థం పుచ్చుకుందువుగానీ" అన్నాడు.
నేను ఏదైనా సమాధానం చెప్పేలోపే మా పిన్ని, "వాడికి తీర్థం పోస్తే మా అక్క నీకు పురుగుల మందు పోస్తుంది, జాగ్రత్త!" అని చెప్పింది.
మా బాబాయి గతుక్కుమని, "మీ అక్క నిజంగానే పోసినా పోస్తుంది" అని గొణిగాడు...
పిన్ని ఇంతలో, "మా అక్కను ఏమైనా అంటే నేనే పోస్తాను పురుగుల మందు" అని కసిరింది...
పాపం బాబాయి సొంతింట్లోనే బెదిరింపులు చూస్తున్నాడు. అమాయకంగా ముఖం పెట్టి ఏదో గొణుగుతూ తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు....
నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి నా రూమ్‌లోకి వెళ్లిపోయాను....
మరుసటి రోజు ఆదివారం.
నేను పొద్దున్నే లేచాను.. ఈ రోజు మా బాబాయి బండి పని చూడాలి...
ఈ రోజు GHMC మున్సిపల్ ఆఫీసుకి కూడా సెలవు...
కానీ ఎలాగో ఒకలా ఆ బైక్ మధ్యాహ్నంలోపు తీసుకురావాలి. ఎలా..
ఇలాంటి పనులు చేయాలంటే చాలా పలుకుబడి ఉన్న మనిషి కావాలి. నా స్నేహితుల్లో అలాంటి పలుకుబడి ఒక్కరికే ఉంది... మహాలక్ష్మి.
మహాలక్ష్మి వాళ్లు అపర కుబేరులు. మహాలక్ష్మి వాళ్ల నాన్న సూర్య ప్రతాప్ యాదవ్ మొత్తం హైదరాబాద్‌లో పేరుమోసిన ధనవంతుడు. వాళ్ల నాన్నగారికి పెద్ద పాలకోవా వ్యాపారం ఉంది. వాళ్లు పాలకోవా తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. కొన్ని తరాలుగా వాళ్లు ఇదే వ్యాపారంలో ఉన్నారు.
అటు వ్యాపారమే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా మహాలక్ష్మి కుటుంబానికి బాగా పలుకుబడి ఉంది. మహాలక్ష్మి బాబాయి లోకల్ రాజకీయ నాయకులతో క్లోజ్‌గా ఉంటాడు. కాంట్రాక్టర్ కూడా. దీంతో భాగ్యనగరంలో వాళ్లకు చాలా పలుకుబడి ఉండేది....
పొద్దున్నే మహాలక్ష్మికి ఫోన్ చేసి, "ఒక పని ఉంది, చేసి పెడతావా?" అని అడిగాను.
దానికి మహాలక్ష్మి, "నువ్వు అడగాలా? అది కూడా ఇంటికి వచ్చేయ్, మాట్లాడుకుందాం" అంది.
సరేలే అని నేను ఉబర్ బుక్ చేసి ఉప్పల్ నుంచి పటాన్‌చెరుకు వెళ్లాను.
మహాలక్ష్మి వాళ్ల ఇంటిని ఇల్లు అనడం కంటే ఇంద్రభవనం అనడం మేలేమో... రెండు ఎకరాల స్థలంలో గొప్పగా కట్టించారు మహాలక్ష్మి వాళ్ల నాన్నగారు.
ఇంటి గేట్ పక్కన "యశోదమ్మ గోకులం" అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఇంటి పేరు చూస్తూ లోపలికి వెళ్లాను.
లోపలికి వెళ్లగానే గంధపు చెక్కల వాసన ముఖానికి హృదయానికి హత్తుకుంది. ఇంట్లోకి కాక ఏదో గుడిలోకి వెళ్ళిన అనుభూతి వచ్చింది.
నేను మహాలక్ష్మి వాళ్ల ఇంటికి రావడం ఇదేమీ కొత్త కాదు. ఇంతకుముందు మేము చదువుకునే సమయంలో చాలాసార్లు వచ్చాను.
ఇంట్లోకి రాగానే మహాలక్ష్మి వాళ్ల నానమ్మ యశోదమ్మగారు పలకరించారు.
నన్ను ఇంకా గుర్తుపట్టడం చూసి ఆశ్చర్యపోయాను. ఇంతకుముందు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చూశాను. అయినా నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారు.
యశోదమ్మగారిలో వృద్ధాప్య ఛాయలు లీలగా కనిపిస్తున్నాయి. కానీ ఆ ధనవంతుల హవా ఇంకా ఉట్టిపడుతూనే ఉంది.
యశోదమ్మగారు అంటే హైదరాబాద్‌లో చాలా మంచి పేరు ఉంది. ఒకసారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం గెలిచింది. ఎన్నోసార్లు పేదల కోసం, అనాథల కోసం ట్రస్ట్‌లకు కాదనకుండా లక్షలు లక్షలు ఇచ్చేసేది.
యశోదమ్మ ఇంటికి వెళ్లి వట్టి చేతులతో వెళ్లినవారు ఉండరు అని జనాలు చెప్పుకుంటారు అంట.
ఒకసారి కట్టిన చీర మళ్లీ కట్టకుండా అప్పట్లో వాళ్ల భర్త, ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ల నాన్న చూసుకుంటున్నారు. అందుకే ఆ ఇంద్రభవనానికి "యశోదమ్మ గోకులం" అని పేరు పెట్టారు.
అంత గొప్ప మనిషి ఆవిడ.
యశోదమ్మ కనిపించగానే ఆవిడ పాదాలకు నమస్కారం పెట్టాను. ఆవిడ కూడా వెచ్చగా నవ్వుతూ తల మీద చెయ్యి పెట్టి నిమిరింది.
ఇంతలో పైనుంచి మహాలక్ష్మి కిందకు వస్తోంది. నన్ను చూసి, "ఏరా, వచ్చావా?" అని పలకరించింది.
"హా, ఇప్పుడే" అని చెప్పి అలా యశోదమ్మగారి పక్కన కూర్చొని, యశోదమ్మ వేసే యోగక్షేమాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉన్నాను.
పైనుంచి మహాలక్ష్మి వాళ్ల నాన్న, అమ్మ కలిసి వస్తున్నారు.
నన్ను చూడగానే మహాలక్ష్మి వాళ్ల నాన్న, "ఏరా, ఎలా ఉన్నావ్?" అని పలకరించారు.
నేను నమస్కారం చేసి, "పర్లేదు అంకుల్" అని చెప్పాను.
మహాలక్ష్మి అమ్మగారు కూడా పలకరించారు. మహాలక్ష్మి వాళ్ల అమ్మగారు వెంటనే వంటింట్లోకి వెళ్లిపోయారు.
ఇక మహాలక్ష్మి వాళ్ల నాన్నగారు, మహాలక్ష్మి, నేను, యశోదమ్మగారు అందరం సోఫాలో సెటిల్ అయ్యాం.
కాసేపు ముచ్చట్లు అయ్యాక మహాలక్ష్మి, "ఏరా, ఏదో పని ఉంది అన్నావు?" అని అడిగింది.
నేను మెల్లిగా మా బాబాయి బండి విషయం చెప్పాను.
దానికి మహాలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుతూ, "ఏరా, మీ బాబాయికి ఆ బండి అంత స్పెషలా?" అని అడిగింది.
"అవునే.... మా బాబాయి దాన్ని తన ఫస్ట్ శాలరీతో కొన్నానని చెప్పుకుంటాడు. అందుకే అది ఎన్ని రిపేర్లు వచ్చినా, దాన్నే మళ్లీ మళ్లీ రిపేర్ చేయించి, కారు కూడా వాడకుండా ఆ డొక్కు బండినే వాడుతూ తిరుగుతుంటాడు. ఈ రోజు మధ్యాహ్నంలోపు ఆ బండి దొరక్కపోతే ఇంక అంతే.." అని వాపోయాను.
దానికి మహాలక్ష్మి నాన్నగారు నవ్వుతూ, "డాక్టర్ గారు ఏం మారలేదు.." అని అన్నారు.
మా స్నేహం పుణ్యమా అని మా కుటుంబాలు కూడా బాగా దగ్గరయ్యాయి. మా కుటుంబాల వ్యక్తులు అందరూ ఒకరినొకరు కలుసుకునేవారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే అందరం కలిసేవాళ్లం.
మహాలక్ష్మి వాళ్ల నాన్న మాట్లాడుతూ, "ఇది ఎంత పని?" అని చెప్పి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.
తర్వాత, "సూర్యా, బండి ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెడతారు. సరే, బండి నంబర్ చెప్పు" అని అడిగారు.
నేను నంబర్ చెప్పాను.
ఆయన ఫోన్‌లో ఇంకొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసి, "ప్రాబ్లమ్ సాల్వ్. నువ్వు ఆ బండిని సన్‌సిటీలోనే కలెక్ట్ చేసుకో" అన్నాడు.
నేను, "చాలా థాంక్స్ అంకుల్" అని చెప్పాను.
దానికి వాళ్ల నాన్న నవ్వుతూ, "దీనికెందుకురా థాంక్స్?" అని అన్నారు.
నేను లేచి, "సరే, ఇక వెళ్తాను" అని అనగానే యశోదమ్మగారు, "ఏరా, యశోదమ్మ ఇంటికి వచ్చి భోజనం కూడా చేయకుండా వెళ్తావా?" అని అడిగింది.
నేను నవ్వుతూ, "ఎందుకు లెండి" అనగానే, "భలే వాడివే! రాక రాక మా ఇంటికి వచ్చావు. భోజనం చేయకపోతే ఏం బాగుంటుంది?" అని నేను కాదనడానికి లేకుండా అక్కడే కూర్చోపెట్టుకుంది.
ఇంతలో మహాలక్ష్మి వాళ్ల అమ్మగారు కిచెన్‌లో నుంచి బయటికి వచ్చి, "మహా, మీ అన్నయ్యను లేపుపో. ఇంకా అలాగే పడుకున్నాడు. తొమ్మిదవుతోంది" అని చెప్పింది.
నేను ఇంతకుముందు ఎప్పుడూ మహాలక్ష్మి వాళ్ల అన్నయ్యను చూడలేదు.
అతని పేరు శ్రీవత్స.
అతను తన చదువులన్నీ నార్వేలో పూర్తి చేసి, ఈ మధ్యనే ఇంటికి వచ్చి వాళ్ల నాన్నగారికి బిజినెస్‌లో సహాయం చేస్తూ ఉంటాడు.
మహాలక్ష్మి "సరే" అని చెప్పి వెళ్లిపోయింది.
నేను యశోదమ్మగారితో, మహాలక్ష్మి వాళ్ల నాన్నగారితో మాట్లాడుతున్నాను.
కాసేపు అయ్యాక మహాలక్ష్మి కిందకి వచ్చి నా పక్కన కూర్చుంది.
కొంచెం సేపు అయ్యాక పైనుంచి ఒక వ్యక్తి ఆవులిస్తూ, ఒళ్లు విరుచుకుంటూ కిందకి వచ్చాడు.
ఎంత అందంగా ఉన్నాడో...
నల్లటి కళ్ళు, రింగురింగుల జుట్టు. బలిష్టమైన దేహం, పొడుగాటి కాళ్ళు, పాలకంటే తెల్లగా ఉన్న శరీరం...
ఏదో మన్మథుడు ఉన్నట్టున్నాడు.
మెల్లగా కిందకి వచ్చి మహాలక్ష్మి వాళ్ల నాన్నగారి పక్కన కూర్చున్నాడు.
నా వైపు చూసి, "ఏమే మహా, ఇతను నీ బాయ్‌ఫ్రెండా? చూడ్డానికి భలే క్యూట్‌గా ఉన్నాడు" అని కామెంట్ చేశాడు.
దానికి మహాలక్ష్మి ఏమాత్రం తడుముకోకుండా, "లేదురా. ఎర్రగడ్డ హాస్పిటల్‌లో మెంటల్ డాక్టర్. మన ఇంట్లో పిచ్చివాళ్లు ఉంటే తీసుకెళ్లిపోదామని వచ్చాడు. బయలుదేరు మరి.." అని అంది.
"వెళ్లాల్సింది నువ్వే కదా! నువ్వేగా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చావు..."
"చూడు నానమ్మ, ఆ రోజు నేను చెప్పాను కదా ఈ పిల్లను కుప్ప తొట్టిలో నుంచి ఎరుకుని రావొద్దు అని. చూడు ఇప్పుడు పిచ్చి కూడా పట్టింది" అని ఎగతాళి చేస్తున్నాడు.
దానికి మహాలక్ష్మి వాళ్ల నాన్న వైపు చూసి, "చూడు నాన్న, వీడు ఏడిపిస్తున్నాడు" అని ఫిర్యాదు చేసింది.
యశోదమ్మ, "అబ్బబ్బా! ఆపండ్రా మీ గోల. ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు" అని కసిరింది.
దాంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు.
మహాలక్ష్మి వాళ్ల నాన్నగారు మా పిన్ని, బాబాయి గురించి, మా కుటుంబాల గురించి కొన్ని ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్తున్నాను.
శ్రీవత్స కూడా మహాలక్ష్మితో ఏదో మాట్లాడుతూ అప్పుడప్పుడూ నన్నే చూస్తున్నాడు.
నేను అది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
సమయం అలా గడిచిపోయింది.
ఇక మధ్యాహ్నం అవ్వగానే అక్కడే భోజనం చేసి, ఉబర్ బుక్ చేసి మహాలక్ష్మి కుటుంబానికి బై చెప్పేసి సన్‌సిటీకి వెళ్లాను.
సన్‌సిటీలో వారిజ వదిన ఇంటి ముందే మహాలక్ష్మి వాళ్ల నాన్న చెప్పినట్టే బైక్ ఉంది.
నేను వెంటనే బైక్ చెక్ చేసి, మహాలక్ష్మికి ఫోన్ చేసి వాళ్ల ఫాదర్‌కి థాంక్స్ చెప్పాను.
ఇక వారిజ వదిన వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ జరిగినదంతా వాగ్దేవికి చెప్పాను....
To be continued...
Please like and comment...

Discussion & Reviews (9)
Share thoughts with Surya and the StoryHub community.
Sign in to leave a comment or reply to Surya.
@Raj thank you raj garu. Meeru nannu ilage support chestu undaali. Naa story Meeku grate experience istundi ani ashistunna
@Praveen hello praveen. Thanks for your support. Storys type chesi post chestune ikkada upload avutayi. Its happens in seconds. No any waiting period.
@Rishi sorry for that rishi. I will try my best to update story as soon as possible

@Zubair thank you for supporting me zubair. Next part is available soon
Hey surya... Bale rasav... Ee platform lo ilanti story.. bale happy ga undi chaduvutunte..
Narration and explain cheyadam kuda chala bavundi.. characters anni kalla mundu kadalaadutunnattuga unnai.. wait for next part
Hi surya
great narration. one doubt
how many days it takes to publish a srory which is on desk
Story chaala slow ga theesuku velthunnaaru
Waiting for next part