కాకతాళీయం - 3
No sex content available in this part. Please skip this story who want sex content
అలా అందరికీ బై చెప్పి కృష్ణ బైక్ ఎక్కాను.
బైక్ స్టార్ట్ చేసి అలా కాస్త దూరం వెళ్లగానే కృష్ణ వెంటనే, “మిమ్మల్ని ఎప్పుడూ డాక్టర్ గారి ఇంట్లో చూడలేదు అండి. మీరు వాళ్లకి రిలేటివా?” అని అడిగాడు.
నేను “హా అవును. ఇంకా నన్ను ముందు ముందు చాలా సార్లు చూస్తావులే” అని అన్నాను.
“మీరు దుర్గ అక్కడ ఉన్నవాళ్లంతా క్లాస్‌మేట్సా?” అని అడిగాడు.
“అందులో క్లాస్‌మేట్స్ ఉన్నారు. ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నారు” అని చెప్పాను.
“హో ఓకే” అని చెప్పి మెల్లిగా ఒక ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం.
అప్పుడే కృష్ణ చేసిన ఒక పని నా మనసుకు హత్తుకుంది.
దూరంలో ఒక చిన్న పిల్లాడు పాపం చెప్పులు లేకుండా చైత్ర మాసం ఎండలు చంపుతుంటే రోడ్ మీద నడుస్తూ ఉన్నాడు. చూడటానికి బిక్షాటన చేసేవారి లాగా ఉన్నాడు. మేము అప్పటికే ట్రాఫిక్ జామ్‌లో పూర్తిగా ఇరుక్కుపోయాం. కృష్ణ వెంటనే బైక్ నాకు పట్టుకోమని ఇచ్చి తన సొంత చెప్పులు తీసి ఆ పిల్లాడికి ఇచ్చాడు.
కృష్ణ చేసిన ఆ పని చూడగానే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది. చెప్పులు విప్పేసి ఆ నల్లటి రోడ్ మీద అడుగు పెట్టగానే అతని ఫేస్ చూడాలి. పాపం బాగా కాలినట్టున్నాయి కాళ్లు.
అతని ఫేస్‌లో ఆ హావభావాలు చూసి నాకు నవ్వు వచ్చింది. నవ్వుతో పాటు పాపం అనిపించింది. పాపం కాలుగాలిన పిల్లిలాగా వచ్చి వెంటనే బైక్ నా వెనుక ఎక్కాడు. నాకు చాలా సంతోషం వేసింది, అతను నా భుజాల మీద అలవోకగా చెయ్యి వేయగానే...
కాసేపటికి ట్రాఫిక్ కాస్త సర్దుకోగానే మేము మళ్లీ మా బాట పట్టాం.
దారిలో నాకు ఒక చెప్పుల అమ్ముకునే రోడ్‌సైడ్ దుకాణం కనిపించింది. దాని దగ్గర ఆపాను.
కృష్ణ అడిగాడు, “ఇక్కడ ఎందుకు ఆపావు?”
నేను అన్నాను, “నీకు చెప్పులు కొందామని.”
అతను మొహమాటం కొద్దీ, “లేదు, ఇంట్లో ఉన్నాయి. ఊరికే వేస్ట్ చేయకు మనీ” అని అన్నాడు.
నేను వెంటనే, “అవునా... సరే. అయితే ప్రస్తుతం వేసుకోవడానికి చీప్‌గా కొంటాను” అని చెప్పి బైక్ దిగాను.
పాపం అతని కాళ్లు భూమి మీద పడగానే మళ్లీ కాలిపోవడం మొదలయ్యాయి. వెంటనే నీడలోకి పరిగెత్తాడు.
నేను తీరిగ్గా నడిచి చెప్పుల దుకాణం వద్దకు వచ్చాను. అక్కడ ఒక ఆంటీ ఉంది అమ్మడానికి.
నా పక్కనే ఉన్న కృష్ణ ఒక జత చెప్పులు చూపించి, “ఇవి ఎంత?” అని అడిగాడు.
ఆ ఆంటీ ఆ చెప్పులు చూసి “నాలుగు వందలు” అంది.
కృష్ణ పేమెంట్ చేస్తూ ఉండగా అతనికి చెయ్యి అడ్డం పెట్టి, ఒక బేరం చేసే ఎక్స్‌పర్ట్‌లాగా ఆ ఆంటీతో, “ఏవమ్మా, ఈ చెప్పులు నాలుగొందలా? రెండు వందలకు రావా?” అని చెప్పి ధర సగానికి తగ్గించాననుకున్నాడు.
ఆ ఆంటీ నన్ను పైనుంచి కింద వరకు చూసి, “తప్పకుండా ఎడమ చెప్పు కావాలా లేదా కుడి చెప్పు కావాలా?” అని అడిగింది.
దానికి కృష్ణ పక్కన ఫక్కున నవ్వాడు.
నాకు ఉక్రోషం వచ్చింది. నేను ఉడుకుతూ, “మూడు వందలకు ఇస్తావా లేదా?” అని అడిగాను.
దానికి ఆ ఆంటీ పెద్ద ఊపిరి పీల్చుకుని, “సరే అండి” అంది.
నేను కృష్ణ పేమెంట్ చేసేలోపు మూడు వందల నోట్లు తీసి ఇచ్చేసి ఆ చెప్పులు కృష్ణకి ఇచ్చాను.
తర్వాత మా ప్రయాణంలో కృష్ణ అప్పుడప్పుడూ ఉలిక్కిపడి నవ్వుతూనే ఉన్నాడు.
అందరి మీద జోకులు పేల్చే నా మీదే ఆ ఆంటీ జోక్ చేసే ఆ దృశ్యాన్ని పదే పదే అవలాగా నెమరువేసుకుని నవ్వుతున్నాడు కాబోలు...
ఆ నవ్వులకు నేను ఉడుక్కొని మిగతా ప్రయాణం అంతా మాట్లాడలేదు.
ఏదో ఆ హైదరాబాద్ ట్రాఫిక్ తప్పించుకుని ఇంటికి వచ్చేసాం. అప్పటికే సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది.
మా ఇల్లు దగ్గర అవ్వగానే నాకు ఒక విషయం ఏదో లీలగా గుర్తుకు వస్తోంది... కానీ ఏంటో అర్థం కావట్లేదు. నేను ఏమీ పట్టించుకోక ఇంటి ముందు దిగి కృష్ణకి ఒక హెచ్చరిక లాంటి చూపు వేసి ఇంట్లోకి వెళ్లాను.
కృష్ణ కూడా వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. ఏదో గొణుగుతూ...
ఇంతలో మా పిన్ని ఏదో చూస్తూ బయటికి వచ్చింది. నన్ను పైనుంచి కింద వరకు చూసింది. అటు పక్క, ఇటు పక్క చూసింది.
“బైక్ ఏదిరా?” అని అడిగింది.
నేను నాలుక కరుచుకున్నా...
ఇంతసేపు లీలగా గుర్తుకొస్తున్న విషయం ఇదే ఆ బైక్...
“నేను పిన్ని, దాన్ని వారిజ వదిన ఇంట్లో వదిలేశాను” అన్నాను.
దానికి మా పిన్ని కాస్త కోపం, ఆందోళన కలిగిన గొంతుతో, “ఏరా, నా కాపురంలో చిచ్చు పెట్టడానికే అంత దూరం నుంచి వచ్చావా! మీ బాబాయికి ఆ బైక్ ఎంత ముఖ్యమో నీకు తెలియదా?” అని చివాట్లు పెట్టింది.
ఒకసారి మా అమ్మమ్మ ఊరు... అదే మా పిన్ని పుట్టింట్లో... ఈయనగారి బైక్ మీద ఒక కోడి పుంజు గోబ్బెమ్మ వేసింది...
మా బాబాయ్ ఆ రోజే దాన్ని కూర కింద మార్చేశాడు. పైగా ఆ పుంజు పక్కింటి వాళ్లది....
అది గుర్తుకొచ్చి నాకు చెమటలు పట్టాయి.
అంటే ఇప్పుడు నా పరిస్థితి ఆ కోడిలాంటిదేనా? మా బాబాయ్ నన్ను కోసి కూర వండుకుని తింటాడా!!
మా పిన్ని బిక్కపోయి చూస్తున్న నన్ను చూసి, “ఏంట్రా చూస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి” అంది.
నేను ఫోన్ తీసి వాగ్దేవికి ఫోన్ చేయబోతూ ఉండగా వాగ్దేవి ఫోన్ చేసింది.
నేను ఫోన్ ఎత్తి ఏదైనా చెప్పేలోపే, “సూర్యా, నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావు?” అని అడిగింది.
నేను వెంటనే, “బైక్‌లో వచ్చాను అండి. బైక్ ఏ మోడల్ అంటే పల్సర్, కొంచెం ఓల్డ్ మోడల్” అని చెప్పాను.
నేను ఏదైనా మాట్లాడేలోపే, “నంబర్ చెప్పు” అన్నాను.
నంబర్ మా పిన్ని చెప్పింది.
ఇంతలో వాగ్దేవి, “సూర్యా, కంగ్రాట్యులేషన్స్! ఇప్పుడే ఒక GHMC టో ట్రక్ వచ్చి నీ బైక్ ఎత్తుకెళ్లిపోతున్నారు” అంది.
.....
నాకు చెమటలు పట్టాయి. మా పిన్ని పక్కనే ఉండి అంతా వింటోంది.
నేను బేలగా వాగ్దేవి ఏదో చెప్తున్నది వినకుండా ఫోన్ కట్ చేసి పిన్ని వంక దీనమైన ముఖం పెట్టి చూశాను...
మా పిన్ని నన్ను తినేద్దాం అన్నట్టు చూసింది.
నేనే కొంచెం ధైర్యం చేసి, “పిన్ని, బాబాయికి ఇప్పుడు ఏం చెప్పాలి?” అని అన్నాను.
మా పిన్ని నన్ను దీర్ఘంగా చూస్తూ, “నీకు బైక్ కీస్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ...” అని ఒక పెద్ద ఊపిరి తీసుకుంది.
“మీ బావ ఇంకా నిద్ర లేవలేదు. లేచేసరికి ఖచ్చితంగా రాత్రి అవుతుంది. ఒక విస్కీ బాటిల్ పోస్తే ఇంకా రేపు పొద్దున పది దాకా లేవడు. పైగా రేపు సండే కాబట్టి ఏం పర్లేదు. నువ్వు రేపు వెళ్లి ఎలాగైనా తెస్తావో ఆ బైక్ తీసుకుని రా” అని చెప్పి ముక్కు చీది ఇంట్లోకి వెళ్లిపోయింది.
నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
రేపు GHMC మున్సిపల్ ఆఫీస్ కూడా సెలవే....
సరే అని ఏడుపు ముఖం పెట్టుకుని ఇంట్లోకి వచ్చాను.
ఇలా సాయంత్రం మా పిన్ని కొడుకులతో ఆడుకుంటూ గడిపేశాను.
ఇంకా రాత్రి అవుతుండగా మా బాబాయ్ లేచాడు.
మా బాబాయ్ లేవగానే ముఖం ఎలా చూపించుకోవాలో అర్థం కాక పిల్లిలాగా టెర్రస్ మీదకి జారుకున్నా...
టెర్రస్ పైకి వెళ్లగానే చల్లటి నగరపు గాలి బాడీకి తగిలింది. పైగా ఆకాశం నిర్మలంగా ఉంది.
పక్క మేడ మీద అప్పటికే మన హీరో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. అదీ నవ్వుకుంటూ.
నాకు అనిపించింది. అతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడా..
అప్పుడే ఇంకోటి అనిపించింది.
అతనిలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఖాళీగా ఎందుకు ఉంటాడు...
ఇది ఆలోచించాక నాకు కాస్త నిరాశగా ఉంది.
నేను దీర్ఘంగా ఊపిరి తీసుకున్నా.
అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు.
అతనికి గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఏంటి, లేకుంటే నాకేంటి?
అతను నాకేమన్నా బాయ్‌ఫ్రెండ్ ఆ? కాదుగా?
మరి నేను ఎందుకు అతని గర్ల్‌ఫ్రెండ్ అనే ఆలోచనకు ఇంత నిరాశ పడుతున్నాను!!
నాకు ఇంతకుమించి ఆలోచించాలి అనిపించలేదు...
ఇంతలో అతని కాల్ అయ్యింది.
అతను నన్ను చూసి చెయ్యి ఊపాడు.
ఎంత బాగున్నాడో!
బయట అందరూ తెల్లతోలు కోసం వెంపర్లాడుతారు కదా. అందులో ఏముంటుంది!!
ఇతను నల్లగా ఉన్నా ఇంత ఆకర్షణ ఎలా ఇస్తున్నాడు..
నేను ఇలా ఆలోచిస్తూ ఉండగా అతనే నా పేరు పెట్టి పిలిచాడు...
నేను ఉలిక్కిపడి కోలుకున్నా.
నేను అసంకల్పితంగా, “ఫోన్‌లో ఎవరు?” అని అడిగాను.
అతను నా వైపు కాస్త దీర్ఘంగా చూశాడు...
అతని కళ్లల్లో ఏదో లెక్కలు కడుతున్నాయి...
“మా చెల్లి” అన్నాడు.
నేను మళ్లీ ఆలోచనలో పడ్డాను.
అతనికి చెప్పాల్సిన పని లేదు.. కానీ ఎందుకు చెప్పాడు...
నేను వెంటనే తేరుకుని నా సిగ్నేచర్ స్మైల్ ఇస్తూ...
“ఇంకా గర్ల్‌ఫ్రెండ్ అనుకున్నానే...” అని సాగదీశాను.
అతను వెంటనే అన్నాడు,
“నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు” అని.....
Please like and share.. it meant encouragement for us..
To be continued...

Discussion & Reviews (9)
Share thoughts with Surya and the StoryHub community.
Sign in to leave a comment or reply to Surya.
Nenu ade alochincha... Bike vesukunellinavadu vere valla bike meda vachadu. Mari bike emaindi ani anukunna.. hahaha krishna meda maikam lo vadilesava.. saripoindi pooo 🤣🤣
@Surya Anthala involve ayyi chaduvuthuna mari
@shine Thank you for your support. Ayina eppudu bikes ee naa naa hero gurunchi kuda pattinchukondi
Thank you for your support. Ayina eppudu bikes ee naa naa hero gurunchi kuda pattinchukondi
Hammaya last part lo mi bike ekada undhi.. ani adiganu epudu aa question ki answer dorikindhi.. manasshanthi..
@krishna thank you krishna for your support. Next part velainanta twaraga post chestanu.
@Santosh thank you santosh i will post next part as soon as possible
surya nuvvu annam thintunava lekha matalani thintunava asalu ala ila matlada galguthunavu. naaku kuda ila matladam nerpinchu surya. super vundhi story. naku hero gurinchi kanna . mee babai ninu em annado anna curiosity ney ekkuvaga vundhi. please twaraga next part raye surya kudhirithey repey upload cheye
Waiting for next part...😍