General

కాకతాళీయం - 2

By Surya · 674 views · 5 min read · 28 Sep 2026

No sex content in this part. People looking for sex content please skip this story

అలా ఆ మేడ మీద మన హీరో లుంగీ ఊడిపోయింది....

నేను కళ్ళు విప్పార్చి చూస్తున్నా. లోపల మన మనసులు చెప్తున్నట్లుగా “సౌందర్య ప్రదర్శన” ఏమీ లేదు. పింక్ కలర్ అండర్‌వేర్ వేసుకున్నాడు మన హీరో. దాని మీద క్యూట్ డోరేమాన్ ఫేస్‌లు ఉన్నాయి....

దాన్ని చూడగానే నా నోరు తట్టుకోలేకపోయింది. నా పెదవులు అసంకల్పితంగా ఒక విజిల్ 😙 వేశాయి...

నేను విజిల్ వేస్తూ ఉంటే మన హీరో నా వైపు కోపంగా చూశాడు. వెంటనే లుంగీ తిరిగి కట్టుకున్నాడు. ఎలక్ట్రిక్ బ్రష్ చేతిలో పట్టుకుని, ఇంకో చేత్తో మొబైల్, లుంగీ పట్టుకుని నాకు డెత్ స్టేర్స్ ఇస్తూ కిందకి వెళ్ళిపోయాడు...

నేను ఎప్పుడు నవ్వడం మొదలు పెట్టానో నాకే తెలీదు.. కానీ పెద్ద స్మైల్ అయితే వచ్చింది నా ఫేస్‌లో.. అలా అంత పెద్ద స్మైల్ వేసుకుని స్టెప్స్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటే, మా పిన్ని అప్పుడే పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి ఇంట్లోకి వస్తుంది. నా స్మైల్ చూసి, “ఏంట్రా అంత పెద్ద స్మైల్ ఇస్తున్నావ్? ఏమైంది?” అని అడిగింది.

దానికి నేను నవ్వుకుని, “ఏం లేదులే పిన్ని,” అన్నాను. మా పిన్ని, “సరేలే. కానీ వారిజా వదిన మొన్న ఎప్పుడో నిన్ను అడిగింది రా.. ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, వెళ్లి కలువు,” అని చెప్పింది.

వారిజ వదిన అనగానే నా కళ్ళు మెరిశాయి. వెంటనే “సరే పిన్ని, వెళ్తాను,” అని చెప్పి మంచిగా ముస్తాబై, మా బాబాయ్ బైక్ కీస్ మా పిన్ని దగ్గర దొంగగా తీసుకున్నాను. ఇంట్లోనే బైక్ స్టార్ట్ చేస్తే మా బాబాయ్‌కి ఎక్కడ తెలుస్తుందో ఏమో అని, ఇంటి నుంచి ఒక పది అడుగుల వరకు బైక్‌ను తోసుకుంటూ వెళ్లాను.

అలా ఇల్లు దాటి మన హీరో ఇంటి ముందుకు వచ్చానో లేదో, మన కళ్ళు అటుసైడ్ వద్దంటున్నా తిరిగాయి. మన హీరో ఇంట్లో సోఫాలో కూర్చున్నాడు. వాళ్ళ అమ్మగారు కాబోలు, బుగ్గలు పట్టి ఇంకా చిన్న పిల్లలకు దువ్వినట్టు జుట్టు దువ్వుతుంది..

ఆవిడ గొణుగుళ్ళు కూడా లైట్‌గా వినిపిస్తున్నాయి. “జాబ్ చేస్తున్నాడు.. ఇంకా జుట్టు దువ్వుకోవడం రాదు. రేపు వీడికి పెళ్ళాం వచ్చినా కూడా నాతోనే దువ్వించుకుంటాడేమో....”

నేను నా పని చూసుకుని పోకుండా అక్కడే ఉండి చూస్తున్నా... ఇంతలో మన హీరో చూపు నా మీద పడింది. నేను వెంటనే ఏమీ చూడనట్టుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను. బట్, ఐయామ్ ష్యూర్.. నేను నవ్వడం అతను ఖచ్చితంగా చూసాడు....

వారిజ వదిన మా బాబాయ్ వాళ్ళ చుట్టం. వరసకు నాకు వదిన అవుతుంది. కాస్త దూరం సంబంధం అయినా చాలా దగ్గరయ్యారు. కారణం వాగ్దేవి. మా క్లాస్‌మేట్..

హైదరాబాద్ వీధుల్లో నన్ను నేను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నా. “నేను ఎక్కడికైనా వెళ్లిపోగలను,” అని చెప్పి. కానీ ఈ మహానగరం నన్ను దారి తప్పించింది. చివరికి నా ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వరీజా వదిన వాళ్ళ ఇంటికి కదిలాను.

మేము ఉండేది ఉప్పల్ అయితే, వారిజ వదిన వాళ్ళు ఉండేది సన్ సిటీ. సో దగ్గరేం కాదు. ఎలాగోలా కష్టపడి వారిజ వదిన వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను. ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టగానే, “వస్తున్నా,” అంటూ డోర్ తెరిచింది శ్యామల.

నన్ను చూడగానే గట్టిగా అరిచింది, “అమ్మా! సూర్య బాబాయ్ వచ్చాడు!” అని...

ఇంతలో అక్కడే ఉన్న ముసలమ్మ అన్నపూర్ణి, “ఒసేయ్ శ్యామల, అరవకే! పిల్లాడిని ఇంట్లోకి రానివ్వు,” అని అంది. ఈ ముసలమ్మ నాకు పెద్దమ్మ వరస.

ఇంట్లోకి అడుగు పెట్టగానే అన్నపూరణి, “ఏరా సూర్యా! మా ఇల్లు ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చిందా?” అని అడిగింది.

నేను కూడా ఆప్యాయంగా ముసలమ్మ అన్నపూరణి పక్కన కూర్చొని, ఆవిడ చెయ్యి చుట్టుకుని, “ఏం చేయను పెద్దమ్మా.. మీ మరిది, మా నాన్న, నన్ను హైదరాబాద్ పంపిస్తేనే కదా. ఎప్పుడూ దూరం అని చెప్పి వద్దంటాడు,” అని వాపోయా.

ఇంతలో మా వరీజా వదిన, మా క్లాస్‌మేట్ వాగ్దేవి, శ్యామల, సరస్వతి అందరూ వచ్చారు.

వారిజ వదిన నన్ను చూసి, “ఏరా, మేము ఇన్నాళ్ళకు కనిపించామా?” అని నవ్వుతూ అడిగింది.

“ఏం లేదు వదినా,” అని సర్ది చెప్పేసి అందరినీ పలకరించాను.

వాగ్దేవి, శ్యామల, సరస్వతి ముగ్గురూ అక్కాచెల్లెళ్ళు. ఇంట్లో అంతా సరస్వతి కటాక్షం ఉండాలి అని అన్నపూరణి పెద్దమ్మ అందరికీ ఆ అమ్మవారి పేర్లే పెట్టింది.

ఇంతలో వాగ్దేవి నా పక్కన కూర్చొని, “ఏరా! ఎలా ఉన్నావ్?” అని నా భుజం మీద చేతులు వేసి అడిగింది.

“పర్లేదే.. నువ్వు ఎలా ఉన్నావ్?” అని అడిగాను.

ఇలా మాటల్లో పడి మా కాలేజ్ గ్యాంగ్ గురించి టాపిక్స్ వచ్చాయి.

హైదరాబాద్ నగరంతో నాకు అవినాభావ సంబంధం ఉండేది. నేను ఇక్కడే నా చదువు పూర్తి చేశాను. ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. ఇక్కడ నాకు కొందరు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

మా గ్యాంగ్‌లో మొత్తం ఏడుగురు మెంబర్స్ ఉండేవాళ్ళం. వాళ్ళను నేను హైదరాబాద్ వదిలి వచ్చేసిన తర్వాత చాలా మిస్ అయ్యాను. మొదట్లో అందరం టచ్‌లోనే ఉండేవాళ్ళం. కానీ మెల్లగా మాటలు తగ్గిపోయాయి.

ఇప్పుడు వాగ్దేవి వాళ్ళు టాపిక్ తేవడంతో నాకు మళ్ళీ అందరినీ కలవాలని అనిపించింది.

నేను ఆలోచించడం చూసిన వాగ్దేవి, “ఏరా, అందరినీ వెళ్లి కలుద్దామా?” అని అడిగింది.

“నేను ఎప్పుడు పదా వెళ్దాం,” అన్నాను.

“నీ అదృష్టం రా! మేమందరం చిన్న గెట్ టుగెదర్ వేశాం. ఈరోజు ఇంకాసేపట్లో వెళ్తున్నాం. నువ్వు ఇప్పుడు ఇలా ప్రత్యక్షమయ్యావ్. పదా వెళ్దాం,” అంది.

నేను ఇంకెందుకు ఆలస్యం అనేసి, వారిజ వదినకి, అన్నపూరణి పెద్దమ్మకి, ఇంట్లో అందరికీ బై చెప్పేసి, వాగ్దేవి స్కూటీ మీద వెనుక కూర్చొని బయలుదేరాను.

అలా స్కూటీ మీద ట్యాంక్ బండ్ దాకా వెళ్ళాం. ట్యాంక్ బండ్‌లో మాకు మీటింగ్ స్పాట్ అయిన వృందా కేఫ్ ఉంది. అందులోనే మా గెట్ టుగెదర్.

నేను, వాగ్దేవి మెల్లగా నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల కొంచెం దూరంలో నాకు కొన్ని తెలిసిన ఫిగర్స్ కనిపించాయి.

వాళ్ళే నిఖిల్, మనోజ్, మోహిత్, మహాలక్ష్మి.

నేను వాగ్దేవితో వచ్చేసరికి అందరూ చాలా సర్‌ప్రైజ్ అయ్యారు.

“ఏరా సూర్యా! ఎప్పుడు వచ్చావ్?” అని మోహిత్ నా భుజం మీద చెయ్యి వేసి లాక్కుని అడిగాడు.

“పొద్దున్నే దిగ్గా,” అని చెప్పి అందరికీ హాయ్ చెప్పి కూర్చున్నా.

వాళ్ళను చుట్టూ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి.

ఇంతలో నాకు ఇంకో పర్సన్ గుర్తుకొచ్చింది.

దుర్గ.

మా గ్రూప్‌లో ఫెమినిస్ట్..

“నేను దుర్గ రాలేదా?” అని అడిగాను.

మహాలక్ష్మి, “దుర్గ వాళ్ళ రిలేటివ్ ఎవరినో వస్తాను అంది. ఇంకా రెండు నిమిషాల్లో వస్తుంది,” అంది.

ఇంతలో నిఖిల్ కలుగజేసుకుని, “అదిగో, మాటల్లోనే వస్తోంది,” అన్నాడు.

నేను అటుపక్క చూశాను.

సన్నని అమ్మాయి.. ఆమె పక్కన ఒక అబ్బాయి వస్తున్నారు.

ఆ అమ్మాయి దుర్గ.

ఆ అబ్బాయి మా పక్కింటి హీరో.

వాడిని దుర్గతో చూడగానే అనిపించింది...

హైదరాబాద్ నిజంగానే చిన్నదని...

దుర్గ నన్ను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి.

మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో నేను నిజంగా క్లోజ్‌గా ఉండేది దుర్గతోనే. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

తను నన్ను చూడగానే వచ్చి, నా పక్కన కూర్చున్న మోహిత్‌ని పక్కకి పంపి మరీ కూర్చొని నాతో మాటలు మొదలుపెట్టింది.

ఇక మన పక్కింటి హీరో.. దుర్గ తనని వదిలేసి నా పక్కన కూర్చోగానే షాక్ అయ్యాడు.

అతను షాక్ అవ్వడానికి కారణం నన్ను చూసి.

ఇంకా దుర్గ అతన్ని వదిలేయడంతో గ్రూప్ ఆఫ్ స్ట్రేంజర్స్ ముందు embarrass కూడా అయ్యాడు.

నిజానికి అతన్ని అక్కడ చూసి నేను కూడా షాక్ అయ్యాను.

దుర్గతో వెంటనే, “ఏయ్ దుర్గా, ఎవరు ఇతను?” అని అడిగాను.

దుర్గకి అప్పుడే తను ఒక పర్సన్‌ని తీసుకొచ్చానని గుర్తొచ్చినట్టుంది. వెంటనే నాకులా కరుచుకుని అతన్ని ఇంట్రడ్యూస్ చేసింది.

అతని పేరు కృష్ణ.

దుర్గ వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్.

ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేసేవాడు. ట్రాన్స్‌ఫర్ అయి హైదరాబాద్ వచ్చాడు. రెండు నెలలు అవుతుందట.

దుర్గనే అతనికి ఇల్లు రెంట్‌కి చూసి పెట్టింది. ఇంకా ఇక్కడ తన ఫ్రెండ్స్‌ని కలవడానికి తీసుకొచ్చిందట.

అలా అందరం కూర్చొని డ్రింక్స్ ఆర్డర్ చేసాం.

కృష్ణ మాత్రం అప్పుడప్పుడు నన్నే చూస్తున్నాడు.

నేను తిరిగి చూస్తున్నా.

నా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉన్నారు. నేను రెస్పాండ్ అవుతూనే హీరో మీద ఓ కన్ను వేసి ఉంచాను.

మహాలక్ష్మి నేను కృష్ణని పదే పదే చూడటం చూసింది.

నన్ను పట్టుకుని, “సూర్యా, ఇతను నీకు ముందే తెలుసా?” అని అడిగింది.

నేను వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా, “హా.. ఈరోజు పొద్దున్నే మొత్తం చూశాను,” అన్నా...

అప్పుడు కృష్ణ పాపం కాఫీ తాగుతూ ఉన్నాడు.

నేను అలా అనడంతో బాగా దగ్గు వచ్చింది.

మహాలక్ష్మి అతన్ని పట్టించుకోకుండా, “ఏంటి?” అని మళ్ళీ అడిగింది.

నేను కూడా వెంటనే, “అదే.. మా పక్కిల్లే కదా, చూశాను,” అని అన్నా.

అప్పుడు దుర్గ, “హా.. నేను మీ పిన్ని వాళ్ళని కనుక్కొని, మీ ఇంటి పక్కన ఖాళీ ఉందంటేనే అక్కడ వాళ్ళకి ఇల్లు చూశాను,” అంది.

అప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు.

కానీ కృష్ణ మాత్రం నన్ను కోపంగా చూస్తున్నాడు.

నిజంగా కోపంతో చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఉన్నాడో అనిపించింది.

వెంటనే గట్టిగా అతన్ని పట్టుకుని కిస్ చేయాలనిపించింది.

కానీ నా లాంటి ఫీలింగ్స్‌యే అతనికి ఉన్నాయో లేదో తెలుసుకోవాలి కదా!

అదే నేను ఫిక్స్ అయ్యాను.

మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం. వాళ్ళతో మాట్లాడుతుంటే సమయం ఎప్పుడో అయిపోయింది.

అక్కడే లంచ్ చేసి, అందరం ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాం.

మోహిత్ వాళ్ళది బాల్కంపేట్.

మనోజ్ వాళ్ళది హైటెక్ సిటీ.

నిఖిల్ వాళ్ళది వనస్థలిపురం.

ఇక నేను, కృష్ణ ఉప్పల్.

మహాలక్ష్మిది పటాన్‌చెరు.

వాగ్దేవిది సన్ సిటీ.

దుర్గది సికింద్రాబాద్.

సో అలా అందరూ ఎవరి వెహికల్స్ వాళ్ళు తీసారు.

నేను, దుర్గ వేరే వాళ్ళ వెహికల్‌లో వచ్చాం.

నేను వాగ్దేవి వెహికల్‌లో వచ్చా. దుర్గ కృష్ణ వెహికల్‌లో వచ్చింది.

కృష్ణ, “రా దుర్గా, వెళ్దాం,” అన్నాడు.

దుర్గ, “అందుకు నేను మెట్రోలో వెళ్తాను. నువ్వు సూర్య కలిసి వెళ్ళిపోండి. మీది ఎలాగూ సేమ్ ప్లేసే కదా,” అంది.

దానికి అందరూ అదే గుడ్ అనడంతో నేను కృష్ణ బైక్ ఎక్కాను.

ఫ్రెండ్స్ అందరికీ బై చెప్పాక మేము ఇంకా ఇంటి బాట పట్టాం.

నేను కృష్ణతో దారిలో కన్వర్‌సేషన్ మొదలు పెట్టాను.....

Please like and comment..

To be continued....
Login to like or save Back to library

Discussion & Reviews (6)

Share thoughts with Surya and the StoryHub community.

Join the discussion

Sign in to leave a comment or reply to Surya.

Sign in to comment
R
Raj · 05 Oct 2026

Hello... Telugulo story chadivi chala kalam aindi.. chala mandi telugulo english laa rasthunte anthaga feel undatam ledu taduvutunte. Ila telugulo rasthunnandu chala thanks..

Intha varaku nenu evariki comment rayaledu abba.. but ne story chaduvutunte oka reality feel vastundi.. keep it up

P
Praveen · 29 Sep 2026

At the age of 22 lo yee terminology elaa raa baabu. may be you born in traditional family mostly i think you are a brahmin boy .

S
Surya Author · 29 Sep 2026

@Praveen thank you Praveen garu. Meeru ilaage support chestu undandi. Madlladi vari to polche anta pedda vadini kadu andi nenu. Im just a 22 year old guy who putting his imagination on paper. Thank you for complement andi

P
Praveen · 29 Sep 2026

HII
Good morning surya ,
I think you are not only an author of gay stories. Basically a hood narrator . Malladi venkata krishnamurthy gurthosthinnaaru. More over you are senior in all aspects . Good tempo n good narration . Its nothing but a novel .

S
Surya Author · 29 Sep 2026

@shine bike la gurinchi enduku andi? Manaki hero mukhyam😁

S
shine · 28 Sep 2026

mari me babai vehicle varija vadhina intlo undhi kadha aa bandi em chesav??